తెలంగాణ
కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను సీఎం రేవంత్ హెచ్చరించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని రేవంత్ హెచ్చరించారు.



