తెలంగాణ
హరీష్ రావు పరిగి పర్యటనను అడ్డుకున్న పోలీసులు

మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ దగ్గర హరీష్ రావు వాహనానికి లారీలను అడ్డం పెట్టి అడ్డగించారు. పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ పాలన రాక్షస పాలన అని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ సర్కార్ ఖూనీ చేస్తోందన్నారు. రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు.



