తెలంగాణ
మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ గన్‌పార్క్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గన్‌పార్క్ నుంచి శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు.



