తెలంగాణ
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ… ట్రాఫిక్, కాలుష్యం, మౌలిక వసతుల లోపాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఓల్డ్ సిటీ అసలు హైదరాబాద్‌గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మెట్రో వెనుకబడిందని విమర్శించారు.
ఉత్తర తెలంగాణ ప్రజలు కంటోన్మెంట్ సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, బేగంపేట అండర్‌పాస్ వంటి ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చామని తెలిపారు. పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.



