ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: నెయ్యిలో అసలు నెయ్యే లేదు

Pawan Kalyan: గత ప్రభుత్వం తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏపీ శాసనసభలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత పాలకులు రసాయనాల నుంచి నెయ్యి తీయొచ్చని నిరూపించారని కామెంట్ చేశారు.
టెండర్ నిబంధనలకు తూట్లు పొడిచారన్నారు. అయోధ్యకు కూడా రసాయనాల లడ్డూలు పంపించారన్నారు. లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు పవన్.



