తెలంగాణ
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేశ్‌రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తికాబోతోంది.



