ఆంధ్ర ప్రదేశ్
భోగి మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధం

తిరుపతిలో భోగి మంటల్లో ద్విచక్ర వాహనాన్ని దగ్దం చేయడం తీవ్రకలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న మధురానగర్ కూడలిలోని ఓ మెకానిక్ షాప్‌లో రిపేర్‌కి వచ్చిన టి.వి.ఎస్ ఎక్సల్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఆకతాయిలు దగ్ధం చేశారు. పాత వస్తువులు మంటల్లో వేయమంటే, రిపేరుకి వచ్చిన వాహనాన్ని అగ్నికి ఆహుతి చేసారని దుకాణ యజమాని లబోదిబోమంటున్నారు.



