ఆంధ్ర ప్రదేశ్
Khammam: ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం అమ్మాయి వివాహం

Khammam: ఫ్రాన్స్ అబ్బాయితో ఖమ్మం జిల్లా మహ్మదాపురం అమ్మాయితో ఘనంగా వివాహం జరిగింది. చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లిన తిరుమలాయాపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ప్రశాంతి చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం తెచ్చుకుంది. తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే నాథన్ క్రిష్టోఫ్ జూబర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండు దేశాల సంప్రదాయాలు, అభిరుచులు వేరైనప్పటికీ.. ఇరు కుటుంబాల సమ్మతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.



