తెలంగాణ
బండ్లగూడలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా

మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తన భర్త తనను మోసం చేశాడని తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా వాసులు సాయి చరణ్ శిల్వ దంపతులకు 15 సంవత్సరాల క్రింతం పెళ్లి జరిగింది. వారి ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
5 సంవత్సరాల నుంచి తనను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్న భార్య తన ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులకు చెప్పిన పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలంటూ…. డిమాండ్ చేసింది.



