సినిమా
కరూర్ తొక్కిసలాట.. సీబీఐ విచారణకు హాజరైన నటుడు విజయ్

తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసింది.
ఆ సమన్ల మేరకు విజయ్ ఈరోజు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందడంతో సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.



