సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ల భరణి

Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ధనుర్మాసంలో ఆ దేవదేవుని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తనికెళ్ల భరణి. ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవానికి హాజరు అవ్వడానికి తిరుపతికి వచ్చానని విద్యతోపాటు సనాతన విలువలు ఆ స్కూల్ నేర్పుతున్నట్లు చెప్పారు.



