తెలంగాణ
వేములవాడ అటవి ప్రాంతంలో చిరుతపులి సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అటవి ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత నెల రోజులుగా అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండడంతో రైతులకు, స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో చిరుత పాదముద్రలు గుర్తించిన అధికారులు.
చుట్టుపక్కాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చందుర్తి మండలంలో నెలరోజుల వ్యవధిలో దాదాపు 8 గొర్రెలను చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత పులి ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.



