ఆంధ్ర ప్రదేశ్
Pithapuram: సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి పవన్

కాకినాడ జిల్లా పిఠాపురంలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబాన్నంటేలా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంకు రానుండగా పవన్ పర్యటన ఏర్పాట్లు, సంక్రాంతి సంబరాల ఏర్పాట్లును అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పిఠాపురంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.



