ఆంధ్ర ప్రదేశ్
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన టూ వీలర్ బైక్ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే బైక్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో బైకు యజమాని శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



