ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేయించిన భార్య

విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన అల్లాడ నాగరాజు మిస్సింగ్ కేసులో భార్యనే ప్రధాన నిందితురాలిగా పీఎం పాలెం పోలీసులు తేల్చారు. గత నెల 9న సాయంత్రం బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి రాకపోవడంతో అతని భార్య రమ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చివరకు భార్య రమ్యనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాపులప్పాడ పరిధిలోని విజ్ఞాన్ స్కూల్ సమీపంలో నాగరాజు మృతదేహన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.



