ఆంధ్ర ప్రదేశ్
ONGC Gas Leak: అదుపులోకి రాని బ్లోఅవుట్

ONGC Gas Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని ఇరుసుమండ గ్రామంలో ONGC గ్యాస్ మంటలు మూడవ రోజూ కొనసాగుతున్నాయి. గత 48 గంటలుగా గ్యాస్ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో చుట్టుపక్కల రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రాణ భయంతో పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.
పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాలతో మంటల తీవ్రత కొంత తగ్గడంతో ప్రజలను పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించారు. ఇదే సమయంలో గ్యాస్ మంటలను అదుపు చేసేందుకు ONGC అధికారులు వెల్ ప్రాంతానికి రాత్రికి రాత్రే రోడ్డు మార్గం ఏర్పాటు చేసి, మంటలను పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు.



