తెలంగాణ
గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం-నల్లమల్లసాగర్, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది.
తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ముంబైలో సీనియర్ లాయర్ సింఘ్వీతో రేవంత్, ఉత్తమ్ చర్చలు జరిపారు.



