ఆంధ్ర ప్రదేశ్
గోవిందరాజు స్వామి ఆలయంలో తాగుబోతు హంగామా టీటీడీ పై భూమన ఫైర్

తిరుపతి శ్రీగోవిందరాజుస్వామి ఆలయ భద్రత వైఫల్యంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సోదరుడు పూజలు అందుకునే రాజగోపురంపై మందు కావాలి అంటూ ఓ తాగుబోతు రచ్చ రచ్చ చేశాడని ఏ స్థాయిలో టీటీడీలో భద్రత డొల్ల ఉందో అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపారన్నారు. ఎంతసేపు మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పడం తప్ప ఆలయ పరిరక్షణ కోసం చేసిందేమీ లేదన్నారు.



