ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో భద్రతా వైఫల్యం.. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హాల్ చల్

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రత వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గం.ల సమయంలో ఏకాంత సేవ పూర్తిచేసి, ఆలయం మూసివేసిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది.అర్థరాత్రి ఆలయం సమయంలో ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురం పైకి ఎక్కిన ఆ వ్యక్తి, గట్టిగా కేకలు వేస్తూ హాల్ చల్ చేసాడు.
అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తిని క్రిందికి దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గం.ల హైడ్రామా తర్వాత, ఎట్టకేలకు అతన్ని, పోలీసులు క్రిందికి దింపి, అదుపులోకి తీసుకున్నారు.



