ఆంధ్ర ప్రదేశ్
Eluru: ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

Eluru: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ముసునూరు మండలం రమణక్కపేటలో జరిగింది. సాయిచంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సప్ స్టేటస్‌లో పెట్టడంతో అమ్మాయి బంధువులు అతని దాడి చేశారు.
పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు యువతి బంధువులు ఆగ్రహంతో దాడి చేశారు. తనను కొట్టి , భార్యను కిడ్నాప్ చేశారంటూ పీఎస్‌లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు.



