తెలంగాణ

హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్‌లు.. నలుగురు ఐపీఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లను ప్రభుత్వం నాలుగు కమిషనరేట్లుగా పునర్ వ్యవస్థీకరించింది . హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతేగాకుండా భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది ప్రభుత్వం.

ఈ మేరకు నాలుగు కమీషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా రమేష్ రెడ్డి,మల్కాజ్ గిరి కమిషనర్ గా అవినాష్ మహంతి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాన్స్ యాదవ్‌ ‌ను ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు రానున్నాయి.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న IT ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్ పూర్ ప్రాంతాలు ఉంటాయి.మల్కాజ్ గిరి కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్ గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది.

దీని పరిధిలోకి కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు వస్తాయి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి చేర్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button