తెలంగాణ
ఉప్పల్లో మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం

ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటచేసుకుంది. కుటుంబ సమస్యలతో ప్రమీల అనే మహిళ కానిస్టేబుల్ బిల్డింగ్పై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసింది.
తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



