తెలంగాణ
Kadthal: వైభవంగా పత్రీజీ ధ్యాన మహాయాగాలు

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జీవిత చరిత్రపై రూపొందించిన పత్రీజీ ఫిలిమ్ ట్రైలర్ ధ్యానులను విశేషంగా ఆకట్టుకుంది. ధ్యాన వేదికపై కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాను పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ పంచాలని జీవితాంతం కృషి చేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మర్షి పత్రీజీ అని కొనియాడారు పలువురు. ధ్యానాన్ని అందరికీ అతి సులువైన మార్గంలో అందించారన్నారు. తన చివరి శ్వాస వరకు ధ్యాన జగత్ కోసం కృషి చేసారని ప్రశంసించారు.



