తెలంగాణ

BRS vs Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం

BRS vs Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ శపథం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జనం అన్నీ గమనిస్తున్నారని.. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారని కేటీఆర్ అన్నారు.

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందన్నారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button