సినిమా
కొడుకులతో హృతిక్ డాన్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కొడుకులతో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కజిన్ ఇషాన్ రోషన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ముగ్గురు సందడి చేశారు. హృతిక్ పిల్లల స్టెప్పులు అదరగొట్టాయి.
బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తాజాగా తన కజిన్ ఇషాన్ రోషన్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా తన కొడుకులు హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్‌లతో కలిసి డాన్స్ స్టెప్పులు వేశారు. ఈ ముగ్గురి డాన్స్ పెర్ఫార్మెన్స్ రిసెప్షన్‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది.
హృతిక్ హిందీతో పాటు సౌత్ ఆడియన్స్ అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్చల్ చేస్తోంది. ఫ్యామిలీతో కలిసి హృతిక్ చేసిన ఈ సందడి అభిమానులను ఆకట్టుకుంటోంది. వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఈ డాన్స్ హైలైట్‌గా మారింది.



