సినిమా

Thalapathy Vijay: అభిమానుల అత్యుత్సాహం.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ విజయ్

Thalapathy Vijay: కోలీవుడ్ అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డారు. మలేసియాలో జరిగిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కార్యక్రమం అనంతరం ఆయన చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. పోలీసులు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కొందరు అభిమానులు విజయ్‌ను చూడాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో విజయ్ కిందపడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది స్పందించి ఆయనను సురక్షితంగా కారు ఎక్కించారు. దీంతో అభిమానులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా, ‘జన నాయగన్’ తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button