ఆది శ్రీనివాస్, లక్ష్మీ నరసింహారావు మధ్య మాటల యుద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహారావు మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాటలు పసలేని మాటలు, పసలేని ఆరోపణలు, అవుట్ డేటెడ్ కంటెట్ అని విమర్శించారు ఆది శ్రీనివాస్. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా, అసెంబ్లీకి రాకుండా జనం బాట పడుతున్నం అనడం విడ్డూరమన్నారు.
అయితే ఆది శ్రీనివాస్ మాటలకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావు సైతం ధీటుగా జవాబిచ్చారు. ప్రజాస్వామ్యంలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఆది శ్రీనివాస్‌ను ఉద్దేశిస్తూ నాలుగుసార్లు ఓడించిన మీకు సిగ్గు రాలేదని పరుష పదజాలంతో ఆరోపించారు. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీని మూడుసార్లు లోక్‌సభలో ఓడించినా, మీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లకు సిగ్గు రాలేదా అని విమర్శించారు.



