తెలంగాణ
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

Hyderabad: తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను మరో ఇద్దరితో కలిసి భార్య హత్య చేసిన సంఘటన హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్‌లో చోటుచేసుకుంది. బోడుప్పల్ ఈస్ట్ బృందావన్ కాలనీకి చెందిన అశోక్ యంనంపేట శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతని భార్య పూర్ణిమకు మహేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పిండంది.
అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్త అశోక్ కు తెలియడంతో.. భర్త అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే మహేష్ అతని స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో పూర్ణిమ ఒప్పుకుంది.



