తెలంగాణ
Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ

Revanth Reddy: నేడు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఏర్పాట్లు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష చేయనున్నారు. అలాగే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.



