తెలంగాణ
కొల్లాపూర్ సంతలో మంత్రి జూపల్లి కృష్ణారావు సందడి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సంతలో మంత్రి జూపల్లి కృష్ణారావు సందడి చేశారు. కూరగాయలు, పండ్లు, ఆకు కూరలను పరిశీలించి వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. పండ్లు, కూరగాయలు కొనుగోలు చేశారు. కూరగాయల మార్కెట్ ఏర్పట్ల పై వ్యాపారులతో మాట్లాడి ఆరా తీశారు. సంతలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంతలో సరదాగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.



