ఆంధ్ర ప్రదేశ్
YS Jagan Birthday: వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు

YS Jagan Birthday: తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని జగన్ ఐదేళ్లలోనే చేసి చూపించారని ఒక ప్రణాళికా బద్దంగా రూపొందిన విధానాలతోనే అది సాధ్యమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే జగన్ పోరాటాలు చేశారన్నారు.



