తెలంగాణ
PV Expressway: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

PV Expressway: హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్‌తో ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.



