తెలంగాణ
కొండా సురేఖ వర్సెస్ బస్వరాజు సారయ్య

వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో మంటలు ఆరడం లేదు. కొండా సురేఖ, బస్వరాజు సారయ్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సారయ్య వర్గంలోకి నల్గొండ రమేష్ చేరికతో అగ్గి రాజుకుంది. తాజా రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్‌తో టీపీసీసీ సభ్యులు నల్గొండ రమేష్, వరంగల్ యూత్ అధ్యక్షులు కొరివి పరమేష్ భేటీ అయ్యారు. కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.



