సినిమా

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్

Andhra King Taluka: యంగ్ హీరో రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తయింది. మంచి టాక్ ఉన్నప్పటికీ అంచనాలకు తగ్గట్టు విజయం సాధించలేకపోయింది. దీంతో రామ్ కెరీర్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఆయన తదుపరి అడుగు ఏమిటన్న ఆసక్తి నెలకొంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం పాజిటివ్ రివ్యూలు, ఆకట్టుకునే సంగీతం, బలమైన నటీనటులతో విడుదలైనా ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షించలేకపోయింది. దర్శకుడు మహేష్ బాబు చెప్పాలనుకున్న కథ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రామ్ కెరీర్‌పై మళ్లీ చర్చ జరుగుతోంది. గతంలో ఫ్యామిలీ, లవ్ జానర్‌లో వరుస విజయాలు అందుకున్న రామ్ ఇటీవల మాస్ ఇమేజ్ సినిమాల్లో ప్రయోగాలు చేస్తూ వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన దిశను మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కొత్త దర్శకుల ఐడియాలతో పాటు హారర్ జానర్ కథలను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే రామ్ కొత్త చిత్రం అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి ఈసారి రామ్ ఎలాంటి కం‌బ్యాక్ ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button