సినిమా

Mana Shankara Vara Prasad Garu: విడుదలకు ముందే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సంచలనం!

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమా బుక్‌మైషోలో హిస్టారికల్ మార్క్ దాటేసింది. విడుదలకు ముందే ఈ రికార్డు సాధించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. నయనతార హీరోయిన్‌గా కనిపించనుంది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌లో భారీ స్థాయిలో ఇంట్రెస్ట్‌లు నమోదవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రం లక్ష ఇంట్రెస్ట్‌ల మైలురాయిని దాటేసింది. గమనార్హమైన విషయం ఏమిటంటే ఇంకా టీజర్, ట్రైలర్ కూడా విడుదల కాలేదు. ఈ రికార్డు ప్రేక్షకుల ఎదురుచూపులను స్పష్టంగా తెలియజేస్తోంది. రిలీజ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మొత్తంమ్మీద ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button