ఆంధ్ర ప్రదేశ్

Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం..కోట్లలో ఆస్తి నష్టం

Fire Accident: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూచౌక్‌ సెంటర్‌లోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్‌లో చెలరేగిన మంటలు క్రమంగా మిగతా షాపులకు వ్యాపించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెల్లవారుజామన ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.

ఇదే కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ శాఖలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

దుకాణంలో వస్త్రాలు, షోరూమ్‌లలో ఉన్న ఖరీదైన దుస్తులు, అల్మారాలు, క్యాష్ కౌంటర్లు అన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. వ్యాపారులు తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కన్నీటిపర్యంతమవుతూ తమ జీవనాధారం ఒక్కసారిగా నాశనం అయిందని వాపోయారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button