తెలంగాణ
Harish Rao: ఫుడ్ పాయిజన్ ఘటన… రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు రావు ఫైర్

Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే అని విమర్శించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు.
కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఓదార్చారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎంకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడే సమయం ఉంది కానీ.. గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా..? అని ప్రశ్నించారు.



