నిధి అగర్వాల్‌తో మారుతి అసభ్య ప్రవర్తన? నెటిజన్ల ఆగ్రహం!

‘ది రాజాసాబ్’ డైరెక్టర్ మారుతి నిధి అగర్వాల్‌తో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈవెంట్లో నడుము చుట్టూ చేయి వేయడంతో నిధి అసౌకర్యం వ్యక్తం చేసింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మారుతిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభాస్ సినిమా కావడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా అంచనాలు పెంచింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్లో మారుతి నిధి అగర్వాల్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు వీడియో వైరల్ అయింది. ఫొటోలకు పోజ్ ఇస్తుండగా నడుము మీద చేయి వేశాడు. అసౌకర్యంగా ఫీలైన నిధి చేతిని తీసేసింది.
మళ్లీ మారుతీ చేయి పట్టుకోవడంతో మారుతి ఫోటో ఫోజులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. కొందరు నెటిజన్లు మారుతిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అతనికి ప్రభాస్ ఎలా అవకాశం ఇచ్చాడని ప్రశ్నిస్తున్నారు. దురుద్దేశం లేకపోయినా మారుతి ప్రవర్తనపై ట్రోలింగ్ మాత్రం జరుగుతోంది. కొందరు మాత్రం మారుతి క్యాజువల్ గా చేయి వేసుంటాడని, చెడు ఉద్దేశ్యంతో అలా చేసి ఉండడని, ఈ విషయాన్ని ఇంతలా సీరియస్ చెయ్యాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



