తెలంగాణ
Phone Tapping Case: సిట్ ఎదుట సరెండరైన ప్రభాకర్ రావు

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులకు లొంగిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ముందుకు వచ్చి సమర్పణ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాకర్‌రావును వారం రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సిట్ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని కేసుతో సంబంధం ఉన్న ముఖ్యమైన అంశాలపై విచారణ జరపనున్నారు.



