జాతియం
అనంత్‌నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఆదీల్ అహ్మద్, జాసిర్ బిలాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
అనంత్‌నాగ్‌లోని మట్టన్ అటవీ ప్రాంతంలో ఉగ్ర ముఠాలు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల గురించి నిందితులు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆత్మాహుతికి ముందు అడవిలో ట్రయల్ రన్ జరిగినట్లు అనుమానిస్తున్న ఎన్ఐఏ ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసింది.



