జాతియం
PM Modi: వందేమాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని నింపింది

PM Modi: వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వందేమాతరం కేవలం పాట కాదని ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని అన్నారు. కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శిస్తూ వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు.



