తెలంగాణ
శీతాకాల విడిది హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ విడదుల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము బస చేయనున్నారు. రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 17న రానున్న రాష్ట్రపతి నగరంలో ఐదు రోజులపాటు ఉండనున్నారు. ఈ ఐదు రోజులు వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. డిసెంబర్ 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం, తేనిటి విందు 22న ఉదయం రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.



