ఆంధ్ర ప్రదేశ్
వీఆర్వో అవినీతి లీలలు.. ఆడియో వైరల్

అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావుకు చెందిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ భూమి విషయంలో గ్రామానికి చెందిన రైతు వద్ద 38 వేల లంచం డిమాండ్ చేశాడు వీఆర్వో.
బాధిత రైతు వీఆర్వో ఆడియోను మీడియాకు ఇవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టారు. వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేశాడు. లంచాలకు అలవాటు పడి ప్రజలను రాబందుల్లా పీక్కుతుంటున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.



