అఖండ 3 పై క్రేజీ అప్డేట్?

Akhanda 3: బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమాపై అపార అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోలకు ముందే అఖండ 3 టైటిల్ లీక్ అయినట్టు కనిపిస్తోంది. థమన్ షేర్ చేసిన ఫోటోలో ఆ సూచన స్పష్టంగా కనిపించింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా పాన్ ఇండియా స్థాయిలో రేపు గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అదిరిపోతున్న ఎక్సైట్మెంట్ నడుస్తోంది. ఇదిలా ఉండగా అఖండ 3 టైటిల్ కూడా బయటకు వచ్చేసింది.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో “జై అఖండ” అనే టైటిల్ స్పష్టంగా కనిపించింది. దీంతో అఖండ 3 టైటిల్ “జై అఖండ” అవుతుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. రేపటి ప్రీమియర్ షోల్లో ఈ విషయం అధికారికంగా తేలిపోనుంది. బాలయ్య అభిమానులు ఈ లీక్‌తో మరింత ఉత్సాహంగా ఉన్నారు.



