తెలంగాణ
కామారెడ్డి జిల్లాలో రూ. 2 కోట్లతో పరారైన వ్యాపారి

Kamareddy: 2 కోట్లతో ఓ వ్యాపారి పరారైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు తలెత్తాయి. గత కొన్ని నెలలుగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు, బ్యాంకు అధికారులు ఒత్తిడి ఎక్కువ కావడంతో సూపర్ మార్కెట్, ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ మేరకు వ్యాపార నష్టాలను వ్రాసి ఓ పేపర్‌ను గోడకు అతికించాడు శ్రీనివాస్.
గత కొద్ది నెలలుగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని ఓ వ్యాపారికి ఇవ్వాల్సిన 30 లక్షల అమౌంట్ ఇవ్వలేకపోవడంతో తన కుటుంబ సభ్యులకు ఆ వ్యాపారి నుంచి ప్రాణహాని ఉందని తెలిపాడు. తన ఆస్తులను అమ్మి కొద్ది రోజుల తర్వాత అమౌంట్ చెల్లిస్తానని వెల్లడించారు. ఈ ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



