రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు!

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్‌లో కాంతార సినిమా పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఆ వ్యాఖ్యలు అనవసరమని, తన ప్రవర్తన తప్పని ఒప్పుకుంటూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బాలీవుడ్ ఎనర్జీ బాంబ్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల కన్నడ సూపర్ హిట్ ‘కాంతార’ సినిమా పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ సందర్భంలో ఆయన చేసిన సంజ్ఞలు, మాటలు అనవసరమైనవిగా, అనుచితమైనవిగా పరిగణించబడ్డాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో రణ్‌వీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో రణ్‌వీర్ సింగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన ప్రవర్తన తప్పు అని, ఎవరి భావాలైన దెబ్బ తింటే క్షమించమని, అవి ఉద్దేశపూర్వకంగా చేసింది కావని స్పష్టం చేశారు. ‘కాంతార’ సినిమా, దాని పాత్రల పట్ల తనకు గౌరవమే తప్ప ఏమాత్రం అగౌరవం లేదని పేర్కొన్నారు. ఈ క్షమాపణ తర్వాత విమర్శలు కొంత తగ్గాయి.



