జాతియం
భూ కేటాయింపుల కుంభకోణంలో షేక్ హసీనాకు ఐదేళ్లు జైలు శిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దోషులైన 17 మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.



