ఆంధ్ర ప్రదేశ్

AP: కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

AP: పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వినయ్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button