రకుల్ కంబ్యాక్!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే 2 రిలీజ్ అయిన 16 రోజులకే 100 కోట్ల క్లబ్లో చేరింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా రకుల్ కెరీర్‌కు ఊతమిచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే 2 హిందీలో విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుంది. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ అద్భుత వసూళ్లు సాధించింది. రిలీజ్ అయిన 16వ రోజునే 100 కోట్ల క్లబ్లో చేరింది. మంచి మౌత్ టాక్‌తో థియేటర్లలో స్టెడీ వసూళ్లు కొనసాగుతున్నాయి.
గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్రాల్లో రకుల్‌కు పెద్దగా హిట్స్ రాలేదు. భారతీయుడు 2 సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో ఈ హిందీ చిత్రం రకుల్ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. చాలాకాలం తర్వాత ఆమెకు 100 కోట్ల క్లబ్ చిత్రం లభించడం విశేషం. మరి ఈ సినిమా ఇంకెంత రాబడుతుందో ఆసక్తికరంగా ఉంది.



