తెలంగాణ
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్ప స్వాములు

తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్నిఅయ్యప్ప స్వాములు ముట్టడించారు. స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన స్వాములను,బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ సిబ్బందిపై ఆంక్షలు ఎందుకంటూ స్వాముల ఆందోళన నిర్వహించారు.



